పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది…రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్

0
10

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వనమహోత్సవం

ఉదయక్రాంతి:- పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని వెంకటేశ్వర టెంపుల్ సమీపంలోని రహదారి పక్కన శనివారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం చాలా పెరిగిందని, మొక్కలు నాటడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని చాలా వరకు అరికట్టవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, యువజన కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, అరుణ్, నేరటి వెంకటేష్, మాయ తిరుపతి, రవి కిరణ్, శశిధర్, ఒజ్జ గణేష్, చోటు, రాజేష్, రహీం, సతీష్, కిరణ్, జావీద్, అర్జున్, చింటూ, కాంగ్రెస్ నాయకులు సోత్కు సుదర్శన్, మంద తిరుమల్ రెడ్డి, గుడ్ల రమేష్, పైడిమల్ల నర్సింగ్, పుల్లూరి లక్ష్మణ్, ఆకారం రమేష్, ఎర్ర రాజు, సంగీ సంతోష్, సట్ల సంతోష్, గడ్డం రజిని, బత్తుల సరిత, శ్రీలత, హఫీజ్, ఉదయ్,  మెప్మా ఆర్పి లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి