చెస్ టోర్నమెంట్ ను విజయవంతం చేయండి

0
13

ఉదయక్రాంతి:- ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బురదగూడెం లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల నందు శనివారం నిర్వహించూ ఇన్విటేషన్ చెస్ టోర్నమెంట్ ను చెస్ క్రీడాకారులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని రాష్ట్ర చెస్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు ఎండి సిరాజ్ ఉర్ రెహమాన్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్దయ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చెస్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఈగ కనకయ్య లు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అండర్ – 7, 9, 11, 13, 15, 17 సంవత్సరాల బాలబాలికలకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి విభాగంలో ఇరువురికి రెండు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మొదట 20 మంది చెస్ క్రీడాకారులకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 8 గంటల 30నిమిషాలకు రిపోర్ట్ చేయాలని, మొదటి రౌండ్ 9 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు ఎవరు చెస్ సెట్లు తీసుకు రాకూడదని, అందరికీ చెస్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు చీఫ్ ఆర్బిటార్ బి ప్రశాంత్, సెల్ నెంబర్ 6305502409 నందు సంప్రదించాల్సిందిగా సూచించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి