రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహాదారుడిగా అంతడుప్పుల నాగరాజు

0
20

ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక మండలి  సలహాదారుడిగా తెలంగాణ ధూమ్ ధామ్ వ్యవస్థాపకుడు,  జాతీయ కళాకారుడు, మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అంతడుప్పుల నాగరాజు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక మండలి సలహాదారుల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరాం, కన్వీనర్ గా డాక్టర్ మామిడి హరికృష్ణ ల తోపాటు పలువురిని సభ్యులుగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం జిఓ జారి చేయగా, అందులో నాగరాజు కు చోటు లభించింది. ఇటివలే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంబరాలకు నాగరాజు కు ప్రత్యేక ఆహ్వానం అందించి, గవర్నర్ చేతుల మీదుగా సత్కరించగా, నేడు నాగరాజు ను సాంస్కృతిక మండలి సలహాదారుడిగా నియమించడంతో ఉద్యమ కళాకారుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ ధామ్ కళాకారుడిగా నాగరాజు నేతృత్వంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తన కళాల రూపంలో ప్రజలను చైతన్య పరచి, రాష్ట్ర సాధన సైనికులుగా మార్చిన ఘనత తెలంగాణ ధూమ్ ధామ్ కళా కారులకే దక్కుతుంది. వారసత్వ సింగరేణి ఉద్యోగాన్ని సైతం  వదులుకొని రాష్ట్ర సాధనకు అంకితమైన నాగరాజును కాంగ్రెస్ ప్రభుత్వం  సాంస్కృతిక మండలి సలహా దారుడిగా నియమించడం పట్ల ఆయన అభిమానులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అంతడప్పుల నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక మండలి సలహాదారుడిగా నియమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి