పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా దానపెళ్లి తిరుపతి…..ఏకగ్రీవంగా ఎన్నిక

0
51

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా దానపెళ్లి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసింది. అధ్యక్ష స్థానానికి అడిచెర్ల నాగేందర్, బత్తుల శ్రీనివాస్, బత్తుల సతీష్ బాబు లు, ప్రధాన కార్యదర్శి పదవికి దానపెళ్లి తిరుపతి లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుండగా, ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సంఘం అడహాక్ కమిటీ సభ్యుడు పుట్ట సదానందం తెలిపారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన దానపెళ్లి తిరుపతి కి సంఘం ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు. పోటీలో ఉన్న అధ్యక్ష అభ్యర్థులు జూన్ 13 లోపు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ప్రచారం ముగించాలని, జూన్ 15న ఎన్నికలు పద్మశాలి సంఘం కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని అడహాక్ కమిటీ సభ్యుడు సదానందం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కుల బాంధవులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిరుపతికి పద్మశాలి కుల బాంధవులు శుభాకాంక్షలు తెలియజేశారు.

కుల బాంధవుల ప్రోత్సాహంతో సంఘం అభివృద్ధికి కృషి

పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి దానపెళ్లి తిరుపతి

పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా అందరి సహకారంతో సంఘం అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. కుల బాంధవుల ప్రోత్సాహంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని, తనను ఆదరించి, సహకరించిన కులబాంధవులు ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలియజేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి