మోడల్ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

0
26

ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాల నుండి 12 మంది విద్యార్థులు ఎంపిక

ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇటీవల నిర్వహించిన పిఎం శ్రీ తెలంగాణ మోడల్ పాఠశాల ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి, మోడల్ పాఠశాలలో సీట్లు కైవసం చేసుకున్నారు. మోడల్ పాఠశాలలో 6 నుండి 12 తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.  ఎంతో శ్రమకోర్చి కష్టపడి సీట్లు సంపాదించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య శ్రీనివాస చారి మాట్లాడుతూ, ఈ విజయానికి అహర్నిశలు తోడ్పాటు అందించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో వేల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు చదువుపించడంతోపాటు మోడల్ పాఠశాలలో సీట్లు సంపాదించడం కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లను ఆశ్రయించి, ధనాన్ని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై విద్యార్థులు తల్లిదండ్రులు ధారపోస్తున్నారని, కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, విద్యను అందించడంతో పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు మోడల్ పాఠశాలకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు, వారి దీనికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య శ్రీనివాస చారి, ఉపాధ్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనక రవి, రమ్య తదితర పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి