
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండల నూతన తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సంఘర్స్ సంతోష్ ను గురువారం తహశీల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య లు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, మొక్కను బహుకరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిఎన్జీవో నేతలు మాట్లాడుతూ, టిఎన్జీవో హౌసింగ్ సొసైటీ సమస్యలను పరిష్కరించాల్సిందిగా తహశీల్దార్ ను కోరారు. స్పందించిన తహశీల్దార్ సంతోష్ సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారన్నారు.