back to top

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Date:

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం పట్టణ అధ్యక్షుడు మిట్ట లక్ష్మణ్ పటేల్, ప్రధాన కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి లు మాట్లాడుతూ, ముందుగా ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.  మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. గత పది సంవత్సరాల నుండి ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, పచ్చడి తీసుకున్న వారందరికీ ఆయురారోగ్యాలు, సర్వసంపదలు కలగాలని ఆకాంక్షించారు. సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పేద వధువులకు పుస్తే మట్టెలు, బట్టలు లాంటివి అందిస్తూ, సంఘం సేవా కార్యక్రమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మండల స్థాయిలో కాపు కుల బాంధవుల సహకారం ఎంతో ఉందని, ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సైతం మున్నూరు కాపు కుటుంబాలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకం సంతోష్, ఉపాధ్యక్షుడు మిట్ట సూర్యనారాయణ, నాయకులు పోలు శ్రీనివాస్, గాండ్ల సంజీవ్, సకినాల శంకర్, తోట సురేందర్, బట్టు రాజ్ కుమార్, మాదాసు కుమార్, కడారి శ్రీధర్, సంగర్తి సంతోష్, సాతిని శ్రీనివాస్ రెడ్డి, పాదం రవీందర్, బద్రి సతీష్, బూబత్తుల శ్రీనివాస్, రేగుల శ్రీనివాస్, బేర వేణుగోపాల్, పుప్పాల శ్రీనివాస్, మల్యాల రమేష్, తోట బిక్షపతి, తిరుపతి లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...