
మందమర్రి తహశీల్దార్ సతీష్ కుమార్
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ తగాదాలపై మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి మండల తహశీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులను అర్జిదారుల నుండి స్వీకరించగా, హద్దుల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ అర్జీ దాఖలు అయ్యిందని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు మండలం లోనీ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, ఎస్హెచ్ఓ లు ప్రతి సోమవారం భూ వివాదాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ వివాదాల పరిష్కారాలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మండలంలోని రైతులు, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మందమర్రి పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ జి రాజశేఖర్ లు పాల్గొన్నారు.


