back to top

పోగొట్టుకున్న 4 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత…. మందమర్రి ఎస్ఐ ఎస్ రాజశేఖర్

Date:

ఉదయక్రాంతి:- పోగొట్టుకున్న నాలుగు మొబైల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ తో గుర్తించి, సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ బాధితులకు  అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ మాట్లాడుతూ, గత ఆరు నెలల క్రితం నుండి వివిధ సందర్భాలలో పలువురు బాధితులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకోగా, బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ఫిర్యాదు నమోదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోగొట్టుకున్న  నాలుగు మొబైల్ ఫోన్ లను వెతికి, పట్టుకొని, బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ఎవరైనా వారి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న, దొంగతనానికి గురైనా 24 గంటల లోపు ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేసుకోగలరని, దీంతో మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ పరిధిలో  సుమారు 150 పోయిన  మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన పట్టణ పోలీస్ స్టేషన్ టెక్ టీం కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్ఐ అభినందించారు. ఈ సందర్భంగా బాధితులు పట్టణ ఎస్ఐ కి, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...