back to top

వినయ్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

Date:

విలేకరుల సమావేశంలో వినయ్ భార్య

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన నస్పూరి వినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా, అతని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య నస్పూరి భాగ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు కోరారు. మందమర్రి పట్టణ ప్రెస్ క్లబ్లో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, తన భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడానికి వోడ్నాల శ్రీనివాస్, అతని భార్య వోడ్నాల మమత లు ప్రేరేపించారని ఆరోపించారు. తన భర్త వినయ్ ను మమత తన వలలో వేసుకొని, తతంగం నడిపించిందని, దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలు తన వద్ద ఉన్నాయని తెలుపుతూ, వాటిని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టింది. వోడ్నాల శ్రీనివాస్ అతని మిత్రులు నరేందర్, సురేందర్, రాజిరెడ్డి అనే వ్యక్తులు పలుమార్లు తన భర్త వినయ్ పై దాడి చేశారని ఆరోపించింది. దీంతో తన భర్త మానసికంగా తీవ్ర ఆవేదన చెందాడని, ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని వివరించింది. వారి వేధింపులు ఆగకపోవడంతో గత నెల తన భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. వినయ్ మృతికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపింది. కానీ విచారణ పేరిట రైల్వే ఎస్ఐ సాక్ష్యులను ఇష్టం వచ్చినట్టు తిట్టినట్లు ఆరోపిస్తూ, రైల్వే పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసును రైల్వే పోలీసుల నుండి పట్టణ పోలీసులకు బదిలీ చేయాలని కోరింది. తనకు న్యాయం జరగకుంటే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని స్పష్టం చేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...