
సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి
అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి
ఉదయ క్రాంతి :- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలని మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి లు తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని సున్నం బట్టి వాడలో గల అంజనీపుత్ర కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలే సృష్టికి మూలమని, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని మన సంస్కృతి తెలిపిందన్నారు. మానవుల మనుగడకు స్త్రీలే ప్రాణమని తెలిపారు. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర డైరెక్టర్లు, మహిళలు పాల్గొన్నారు.