back to top

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

Date:

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి. ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుకట్ల పొశం మల్లీశ్వరి, కుటుంబాన్ని పోషించేందుకు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఇందు గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం మార్చి 9న జరగనుండగా, పెళ్లి ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్ అభయ హస్తం  అందిస్తూ, సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శనివారం ఆయన తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు 50,000 రూపాయల నగదు, పెళ్లి బట్టలు అందజేశారు. అనంతరం కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యురాలిగా భావించి, ప్రేమతో ఆశీర్వదించారు.

“ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం”*

ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, నాయకత్వం కేవలం రాజకీయాలకు పరిమితం కావాలి కాదు, సహాయం అవసరమైన వారి కోసం నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణమని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు, ఇలాంటి సందర్భాల్లో తమ వంతు సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు.

*ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మానవతా గుణం*

సదానందం యాదవ్ చేసిన మానవీయ చర్య స్థానిక ప్రజల హృదయాలను హత్తుకుంది. ఇలాంటి నాయకుల వల్లే సమాజం బాగుపడుతుందని వార్డు పెద్దలు, మహిళలు ప్రశంసించారు. అధికారంలో లేకున్నా పేదల కోసం నిలబడే నేతలు అరుదుగా కనిపిస్తున్నారు. సదానందం  నిబద్ధతకు హృదయపూర్వక నమస్కారం అంటూ పలువురు హర్షం వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అండగా నిలిచే గొప్ప మనస్సు ఉన్న నేతగా బండి సదానందం యాదవ్, సామాజిక సేవకు చిరునామాగా మారారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...

ఒకే స్థలంలో.. ఒకే దేవతకు… రెండు ఆలయాలు

గందరగోళంలో ముదిరాజ్ కులస్తులురెండో ఆలయ నిర్మాణానికి అనుమతులు ఎక్కడివి...? ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా...