
ఉదయక్రాంతి :- మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో శనివారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాపూరావు, కార్యదర్శి అజ్మత్ ఆలీ లు ఎన్నికల అధికారుల వ్యవహరించగా, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ను పునర్వ్యవస్థకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2019లో ఉద్యోగంలో చేరి, ఇటీవల రెగ్యులర్ అయిన వారికి సైతం జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించడం జరిగిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా పూదరి నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా లకావత్ శ్రీనివాస్ నాయక్, అసోసియేట్ అధ్యక్షులుగా తాజ్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మధు, వరప్రసాద్, సుజాత, జాయింట్ కార్యదర్శులుగా వంశీకృష్ణ, రాజశేఖర్, శ్రీవిద్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కృష్ణమూర్తి, కార్యాలయ కార్యదర్శిగా వెంకటరమణ, స్పోర్ట్స్ కార్యదర్శిగా అభిలాష్, ఈసీ సభ్యులుగా కిరణ్, కల్పన, మధు, శ్రీనివాస్ రెడ్డి లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫోరం నూతన కార్యవర్గాన్ని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, జిల్లా సభ్యులు నాగరాజు, శ్రీనివాస్, సుమన్, విద్యాలత, క్రాంతి, పద్మనాభం, దివాకర్, సత్యనారాయణ, సనంద, వెంకటస్వామి, సురేష్, రాజేష్, సతీష్, అశోక్ లు పాల్గొన్నారు.