back to top

ఏరియాలో చేరికలతో బలపడుతున్న సిఐటియు

Date:

ఉదయక్రాంతి :- గత కొంతకాలంగా సింగరేణి మందమర్రి ఏరియాలో ప్రతిపక్షంగా సిఐటియు చేస్తున్న ఆందోళనలను గమనించిన పలువురు ఇతర యూనియన్ లకు చెందిన కార్మికులు యూనియన్ లో చేరడంతో ఏరియాలో యూనియన్ మరింత బలోపేతం అవుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా సివిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో సివిల్ విభాగం యూనియన్ పిట్ కార్యదర్శి రాజ్ కుమార్ నాయకత్వంలో కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు యూనియన్ లో చేరారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, యూనియన్ లో చేరిన ఫిట్టర్ కే శ్రీనివాస్, పంపు ఆపరేటర్లు సత్తయ్య, మహేందర్, వాల్వ్ ఆపరేటర్  బి కుమారస్వామి, శంకర్ లతో పాటు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, సాంబశివుడు లకు యూనియన్ కండువాలు కప్పి, సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో గెలిచిన సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను స్ట్రక్చరల్ సమావేశాల్లో మాట్లాడి పరిష్కరించాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ ఉన్నదని ఇప్పుడు దాటవేస్తున్నారని, కోడ్ లేని సమయంలో ఎందుకు మాట్లాడి పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే సొంతింటి కల నెరవేరుతుందని పలువురు కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేయకుండా ఉంటున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి గెలిచిన సంఘాలు ప్రభుత్వం, యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, అమలు చేయించాలని డిమాండ్ చేశారు. సివిల్ కార్మికుల సిబ్బంది కొరతను తీర్చాలని, వారి డిసిగ్నేషన్ కు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలన్నారు. మహిళలను డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామని చెబుతున్న యాజమాన్యం దానివలన ఆక్టింగ్ ప్యానెల్ లో ఉన్న కార్మికులకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు రామగిరి రామస్వామి, సీనియర్ నాయకులు అలవల సంజీవ్, ఆర్గనైజర్లు సంకె వెంకటేష్, డి సురేష్, కే శ్రీనివాస్, నాగరాజు, కాంటాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్, సివిల్ కార్మికులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...