
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఉదయక్రాంతి :- రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గతంలో అర్హత కలిగి ఉండి, దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 28 వరకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుండి 3 పద్దతులలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మొదటి పద్దతిలో టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 నెంబర్లో కుటుంబ పెద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వివరాలను పరిశీలించి, ప్రాథమిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందని, ఒకవేళ వివరాలు లేనట్లయితే పై అధికారులకు దరఖాస్తు పంపించడం జరుగుతుందని తెలిపారు. 2వ పద్దతిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చునని, 3వ పద్దతిలో ఆన్లైన్లో https://seeepcsurvey.cgg.gov.in వెబ్సైట్ లో సర్వే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని, పూరించి, సమీపంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో సమర్పించవచ్చునని తెలిపారు. సంబంధిత అధికారులు రోజువారిగా దరఖాస్తుల ప్రక్రియ పరిశీలించడం జరుగుతుందని, జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని అన్నారు. మున్సిపాలిటీలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.