
ఉదయక్రాంతి :- హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో శుక్రవారం నిర్వహించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనను పట్టణానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే యువజన కాంగ్రెస్ ఎన్నికలో ఎన్నికైన సభ్యులు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ నాయకుడు రాయబారపు కిరణ్, చెన్నూరు నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జలంపల్లి సృజన్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బియ్యపు రవికిరణ్, యువజన నాయకులు ఎండి తౌసిఫ్, ఒజ్జ గణేష్, రాజేష్, సూరజ్, శశి, మహేష్, సురేందర్, అజయ్ లు పాల్గొన్నారు.