back to top

నిజాయితీ చాటిన ఆటో కార్మిక సేవా సమితి ఫౌండేషన్

Date:

పోగొట్టుకున్న సెల్ ఫోన్  తిరిగి అందజేత
ఉదయక్రాంతి :- గత శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన గసిగంటి శ్రీకాంత్ కు చెందిన 25 వేల రూపాయల విలువ గల వన్ ప్లస్ సెల్ ఫోన్ ను పోగొట్టుకోగా, పోయిన సెల్ ఫోన్ ను బాధితునికి అందజేసి, ఆటో కార్మిక సేవా సమితి ఫౌండేషన్ తన నిజాయితీని చాటుకుంది. మంగళవారం బాధితుని తల్లి గసిగంటి శారద కు శ్రీకాంత్ సెల్ ఫోన్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ నేరెళ్ల వెంకటేష్ మాట్లాడుతూ, శనివారం పోచమ్మ గుడి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ లో గసిగంటి శ్రీకాంత్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోగా, ఆ సెల్ ఫోన్ ఫౌండేషన్ కోశాధికారి చొప్పరి లచ్చన్న కు లభించింది. దానిని ఆటో కార్మిక సేవ సమితి చైర్మన్ నేరెళ్ల వెంకటేష్ కు అప్పగించగా, సంస్థ సభ్యులందరూ కలిసి, బాధితుని అడ్రస్ తెలుసుకొని, తిరిగి మంగళవారం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఆటో కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో బాధితుడు గసిగంటి శ్రీకాంత్ తల్లి గసిగంటి శారద కు తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సేవ సమితి ఎగ్జిక్యూటివ్ సభ్యులు రెడ్డి ఐల్లయ్య, పొన్నగంటి లచ్చన్న, రవి, సోడాల మల్లేష్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...