
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన దాడి కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, రిమాండ్ చేసి కోర్టు ముందు హాజరు పరచడం జరిగిందని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలూద్దీన్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ కే మహేందర్ లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ బార్ లో తాండూరు కు చెందిన బండారి వంశీ పై బీరు సీసాలతో కొట్టి, మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటనలో నమోదైన కేసులో నిందితులైన బెల్లంపల్లి గాంధీనగర్ కు చెందిన అల్లి సాగర్, బట్వాన్ పల్లికి చెందిన రత్నం సోమయ్య, మంచిర్యాల ఇస్లాంపూర్ కు చెందిన మామిడి అన్నమయ్య లను అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరు పరచడం జరిగిందన్నారు.


