back to top

కుంటుపడుతున్న సింగరేణిలో పరిపాలన

Date:

*సిఎండి కి, డైరెక్టర్లకు పొడగింపు ఉత్తర్వులు లేక పరిపాలన అస్తవ్యస్తత్వం*

*వాటాదారులైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టని సింగరేణి

బొగ్గు రంగంలో వంద సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సింగరేణి, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు విరిజిమ్ముతూ, దక్షిణాదిన విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును అందిస్తూ విరాజిల్లిన సింగరేణి సంస్థ నేడు బకాయిలు రాక, ఒకవైపు సంస్థలో ఉన్న పరిపాలన వ్యవస్థను నడిపించాల్సిన ఉన్నతాధికారులకు పొడిగింపులు ఉత్తర్వులు రాక, అస్తవ్యస్తంగా తయారైందని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో కొత్త బొగ్గు గనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సింగరేణి సంస్థ సైతం ప్రైవేట్ వారితో పోటీపడి బొగ్గు గనులను వేలంలో కొనుక్కోవాల్సిన పరిస్థితులు తీసుకువచ్చిన నాయకుల విధానాలతో సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోతుందని పలువురు కార్మిక సంఘాల నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాల ఒప్పందంతో అన్ని దేశాల్లో థర్మల్ విద్యుత్ తగ్గించాలనే ఒప్పందంతో భవిష్యత్తులో థర్మల్ విద్యుత్ ప్లాంట్ లు మూత పడే అవకాశం ఉండగా సింగరేణిలో మాత్రం అదేమీ పట్టించుకోకుండా జైపూర్ పవర్ ప్లాంట్ కు అనుబంధంగా మరొక థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సలహాలు చేస్తున్నారు. ఇప్పటికే జైపూర్ విద్యుత్ ప్లాంట్ విద్యుత్ కు, సింగరేణి రవాణా చేసిన బొగ్గు కు రావలసిన బకాయిలు రాకపోగా, ఇప్పుడు అనుబంధంగా ఏర్పాటు చేసే విద్యుత్తు ప్లాంట్ తో ఏర్పాటయ్యే విద్యుత్ కు అయిన డబ్బులు చెల్లిస్తారని అనుమానం కార్మిక వర్గంలో లేకపోలేదు. బకాయిలు పేరుకు పోతుండటంతో సింగరేణి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి భవిష్యత్తులో ఉండదని అందుకే సింగరేణి సైతం వేలంలో పాల్గొనడానికి వెనుకడుగు వేస్తుందని కార్మిక సంఘాలు బహిరంగంగా పేర్కొంటున్నాయి.

*ఖాళీగా డైరెక్టర్ పోస్టులు*

మరోవైపు సింగరేణిలో సంస్థ చైర్మన్, ఐదుగురు డైరెక్టర్లు తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నామినేట్ చేసిన మరో నలుగురుకీ పైగా డైరెక్టర్ల సైతం ఉంటారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండడం వల్ల సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన డైరెక్టర్ల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల వీరిదే పైచేయిగా ఉంటుంది. కానీ నేడు సంస్థలో డైరెక్టర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి లకు పొడిగింపు ఉత్తర్వులు రాక పోవడంతో డైరెక్టర్ పా, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, ఆపరేషన్స్, లేకపోవడంతో డైరెక్టర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీనితో సింగరేణిలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా కుంటుపడినట్లుగా కనిపిస్తున్నది. తెలంగాణకే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సింగరేణి బొగ్గు సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాల నుండి డివిడెంట్లు తీసుకుంటూ, కల్పతరువుగా భావిస్తున్నాయే తప్ప దాని పరిపాలన వ్యవస్థ, భవిష్యత్తుపై ఎలాంటి దృష్టి పెట్టడం లేనట్లుగా ఉందని సింగరేణి వ్యాప్తంగా బహిరంగంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్ కి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ను వలన చైర్మన్ కి, డైరెక్టర్ల పొడగింపు పట్ల మీనమేషాలు లెక్కిస్తుండడంతో సింగరేణి పరిపాలనపై నీలిమేఘాలు కమ్ముకున్నట్లుగా అనిపిస్తుంది. 49శాతం వాటా దారునిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సైతం సింగరేణిలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితి పై దృష్టి సారించడం సారించక పోవడంతో, సింగరేణి ప్రైవేటీకరణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపాయికారీ ఒప్పందంలోని భాగమేనా అని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ప్రజా వేదికలపై ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వాల వైఖరి సైతం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని అనడంలో సందేహం లేదు.

*పేరుకు పోతున్న కార్మికుల సమస్యలు*

ఇదిలా ఉండగా సింగరేణిలో ఎన్నికలు కావాలని టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసిందంటూనే వారితోపాటు ప్రాథమిక సంఘంగా కొనసాగిన ఏఐటియుసి కోర్టుకు వెళ్లి మరి సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేలా చేసి, గుర్తింపు సంఘాలు గెలుపొందింది. నాలుగు సంవత్సరాలు కావాలని పట్టుబట్టగా ప్రతిపక్షాల ఆందోళనతో అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాలకి గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన స్ట్రక్చర్ సమావేశాలకు డైరెక్టర్ పా వద్ద నిర్వహించి, పలు సమస్యలపై ఒప్పందానికి వచ్చారు కానీ ఆ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఎన్నికల కోడ్ లేనప్పుడు స్ట్రక్చర్ సమావేశాలకు పట్టుబట్టి, కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించడం లేదని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని ప్రతిపక్ష కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం వైఖరిని తప్పుపడుతున్నాయి. యాజమాన్యం ఇటీవల నిర్వహించిన పలు వేదికలపై రాజకీయ జోక్యం వద్దంటున్న గుర్తింపు సంఘం నాయకులు అదే రాజకీయ నాయకులకు చెరో పక్కన ఉండటం విశేషం. యాజమాన్యం ఏదైనా ఉత్తర్వులు ఇస్తే తామే మాట్లాడామని చెప్పుకుంటున్న నాయకులు కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై మాత్రం చర్చించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియడం లేదు.

*సింగరేణి పరిరక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యం*

ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలు సింగరేణికి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కొత్త గనుల కోసం వేలంపాటలో లేకుండా కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలని, దీర్ఘకాలిక సమస్యలపై పరిష్కరించాల్సిందిగా అన్ని కార్మిక సంఘాలను ఏఐటీయూసీ పై ముందుండి కలుపుకొని పోయి, కార్మిక సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. లేదంటే ఒంటరిగా పోతే అటు సింగరేణికే కాక కార్మికులకు సైతం నష్టం చేసిన వారు అయ్యా అవకాశం సైతం లేకపోలేదు.

*వ్యాసకర్త*
*నందకేయ✍️*

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...