
*ఉదయక్రాంతి* :- ప్రతి ఉద్యోగంలో ఒత్తిడిలు సహజంగా ఉంటాయని, పోలీసు ఉద్యోగుల అవి సహజమని, పోలీసు ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకున్నదని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని, ముందుకు వెళ్లాలని డిసిపి ఏ భాస్కర్, ఐపీఎస్ తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మంచిర్యాలకు చెందిన టచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం పోలీసులకు కార్డియాలజీ స్క్రీనింగ్ కి సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల టౌన్ సిఐ ప్రమోద్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా డిసిపి ఏ భాస్కర్, ఐపిఎస్, మంచిర్యాల ఏసిపి రత్నపురపు ప్రకాష్, బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వరరావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిపి భాస్కర్ మాట్లాడుతూ, పోలీసులు పిల్లల్ని, కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఆలోచన పద్ధతులు, అలవాట్లు మార్చుకొని, ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా జీవితాన్ని సంతోషంగా గడపాలని సూచించారు. గుండెకు, ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల సొంత వైద్యం చేసుకోరాదన్నారు. ఈ శిబిరంలో ప్రతిరోజు 20 మందికి చొప్పున దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనునట్లు తెలిపారు. అనంతరం టచ్ ఆసుపత్రి కార్డియాలజీస్ట్ రాజేష్ బుర్కండే గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టచ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ తిరుమల్ రావు, డాక్టర్ వికాస్, డాక్టర్ సుమన్, సిఈఓ రాజ్ పాల్, మేనేజింగ్ డైరెక్టర్ మాటేటి శ్రీనివాస్, డైరెక్టర్లు శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, జాన్కర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, పోలీస్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


