
*ఉదయక్రాంతి* :- సింగరేణి కార్మికుల హక్కుల సాధనకై రాజీలేని పోరాటలకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం ఏరియాలోని కాసీపేట 2 గనిపై యూనియన్ గని పిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన, యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప నరసయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు పని ప్రదేశాలలో సరైన పనిముట్లు, మెటీరియల్, సేఫ్టీ గ్లౌజులు, బూట్లు, డబుల్ స్టాప్ రేకులు లేక కార్మికులు అధిక పని భారంతో మానసిక వేదనకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ మైన్స్ రెగ్యులేషన్ ప్రకారంగా వర్క్ నామ్స్ అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాసిపేట 2 గనిలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ చేసే లారీలు సమయానికి అందుబాటు లేక డంపింగ్ చేయడం వల్ల బొగ్గు క్వాలిటీ, క్వాంటిటీ తగ్గి, సింగరేణికి నష్టం కలుగుతుందని, వెంటనే పై స్థాయి అధికారులు బొగ్గు ట్రాన్స్ పోర్ట్ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో పై స్థాయి డైరెక్టర్లు లేక కార్మిక సమస్యలపై డైరెక్టర్ స్థాయిలో సమావేశాలు నిర్వహించలేకపోతున్నారని, దీనితో అనేక సమస్యలు పేరుకు పోతున్నాయని, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వలన డైరెక్టర్లు, సీఎండి లను నియమించే విషయంలో ఆలస్యం జరుగుతుందని, వెంటనే డైరెక్టర్లను, పూర్తిస్థాయి సిఎండి ని నియమించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక విధివిధానాలపై కార్మికుల హక్కుల కోసం రానున్న రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా సేవ్ సింగరేణి నినాదంతో కార్మికులందరి చైతన్యపరిచి, రాజకీయ జోక్యాన్ని అడ్డుకుంటామన్నారు. అదేవిధంగా కొన్ని జాతీయ సంఘాలు అర్ధం లేని తప్పుడు ఆరోపణలతో కార్మికులను అయోమయాన్ని గురి చేస్తూ, ఏఐటియుసిని కించపరిచే విధంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం గనికి చెందిన 13 మంది ఉద్యోగులు యూనియన్ లో చేరగా, వారికి యూనియన్ కండవాలు కప్పి, సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. యూనియన్ లో చేరిన వారిలో కె నాగమణి, ఎం ప్రత్యూష, జి శిరీష, పి రాజేశం, మెహతాబ్, నాగేంద్ర, నరేంద్ర, అమిత్, చంద్రశేఖర్, శ్రీనివాస్, తిరుపతి, వంశీ, శేఖర్ యాదవ్ లు కలరు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పిట్ ఉపాధ్యక్షులు కొండపల్లి నర్సయ్య, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి బొద్దుల వెంకటేష్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్, నాయకులు జోగు కేతన్, రాజ కొమురయ్య, రాయలింగు, వేణుగోపాల్, సాగర్, నీలయ్య, నర్సిరెడ్డి, తిరుపతి, సురుమల్ల వినయ్ కుమార్, దేవుళ్లపల్లి శ్రీనివాస్, రత్నం నవీన్, సురేష్ లు పాల్గొన్నారు.