విద్యార్థులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా సక్రమ దిశలో ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు ఐతగాని నిర్మల, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఉమాదేవి అన్నారు. గురువారం రోజున నంది మేడారం బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ పిల్లలు విద్యార్ధి దశనుండే మంచి అలవాట్లు చేసుకొని జీవితంలో ఉన్నత స్థా నానికి ఎదగాలని ఈ ప్రయాణంలో పిల్లల హక్కులకు ఏవరైనా ఆటంకం కలిగిస్తే 1098 కి కాల్ చేసి మీ హక్కులను పరిరక్షించుకోవచ్చునని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో తల్లిదండ్రులు లేని పిల్లలు, చదువుకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న పిల్లలు మీ దృష్టిలోకి వస్తే తమకు తెలియజేయాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కొరకు తాము నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.బాల్య వివాహలు, బాల కార్మికులు, బిక్షాటన చేసే పిల్లలు తమ తమ హక్కులను కోల్పోతున్నారని అలాంటి పిల్లలకు చేయూతను అందివ్వటమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ టీం సభ్యులు కల్పన, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ యుగేంద్ర లక్ష్మి, విద్యార్థులు, భోధనా సిబ్బంది పాల్గొన్నారు.
