మహిళలు శారీరకంగా,మానసికంగా క్షోభకు గురి కావద్దు..
జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత..
పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు నేరం…
మహిళలు శారీరకంగా,మానసికంగా క్షోభకు గురి కావద్దు..
జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత..
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే, పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోంది. వేధింపులు, దాడులు మహిళల్లో అభద్రతను పెంచి పోటీ ప్రపంచంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి.శారీరకంగా, మానసికంగా వారిని క్షోభకు గురి చేస్తున్నారని జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత పేర్కొన్నారు.
గురువారం నగరంలోని పోలిస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత
మాట్లాడుతూ
స్త్రీలపై అత్యాచారానికి పాల్పడినా, శారీరక సంబంధం పెట్టుకొమ్మని బలవంతం చేసినా, వారితో అశ్లీల పదజాలం వాడినా, అశ్లీలంగా ఎటువంటి సైగలు చేసినా, అశ్లీల చిత్రాలు తీసినా, చూపించినా, శారీరకంగా గాని మానసికంగా గాని వారిని ఎటువంటి లైంగిక ఇబ్బందులకు గురిచేసినా అవి లైంగిక వేధింపుల క్రిందికి వస్తాయనీ పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వరంగ సంస్థ, ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ, ప్రైవేటు కర్మాగారం, విద్యాసంస్థ, ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ సంస్థ, సొసైటీ, ట్రస్టు, ఎన్జవో, సేవలందించే సంస్థ, ఆసుపత్రి లలో మహిళపై లైంగికంగా వేధిస్తే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్ లో లేదా షీ టీమ్,భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మహిళలు పని చేసే చోటు లైంగిక వేధింపులకు గురికాకుండా అందుకు సంబంధించిన పరిశ్రమలు లేదా కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పని చేసే చోటు మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. మహిళలకు గృహ హింస నుంచి రక్షణ.. గృహ హింస చట్టం ప్రతి మహిళకు గృహ హింస నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు.ఈ చట్టం స్త్రీలను వారి భర్త-భార్య సంబంధాలలో హింస నుండి మాత్రమే కాకుండా, వారు గృహ సంబంధంలో ఉన్న వ్యక్తులతో ఒకే ఇంట్లో నివసించే మహిళలను కూడా రక్షిస్తుంది.
స్త్రీలను వివాహం ద్వారా వారి సంబంధాలలో హింస నుండి రక్షిస్తుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మహిళలు న్యాయ సలహాలు సూచనలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. సలహాల కోసం 15100 నంబర్ కు ఫోన్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.అలాగే ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో వివిధ ఛాయాచిత్రాలు వీడియోలు భద్రంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఫోటోలు వీడియోల ద్వారా సైబర్ నేరగాళ్లు పన్నాగం వేసి మహిళలను వేధిస్తున్నారని వారి ఖాతా నుంచి డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.ఇలాంటి సైబర్ నేరగాల నుండి వచ్చిన ఫోన్ ఈ చట్టం స్త్రీలు పని చేసే ప్రదేశాలలో వారిపై లైంగిక వేధింపులను అరికట్టడానికి, అదే సమయంలో ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తూ తప్పుడు ఫిర్యాదులను చేయవద్దని కోరారు. ఇంటర్నల్ కంప్లెంట్ కమిటీ ఏర్పాటు..ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో పనిచేసే మహిళలు, పది మంది కాని అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లయితే అక్కడ ఇంటర్నల్ కంప్లెంట్ కమిటీ (ఐ సీ సి) ఏర్పాటు చేయాలన్నారు.
ఇంటర్నల్ కమిటి సభ్యుల పేర్లు, సెల్ నెంబర్లు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలవారి కార్యాలయాల్లో అందరికి కనిపించే విధంగా బోర్డు ఉండాలి. అక్కడ పనిచేసే మహిళ వేధింపులకు గురి అయితే ఆ ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.ఈ కమిటి విచారణ జరిపి వారి సర్వీస్ రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటుందన్నారు.
ఈకార్యక్రమంలోనిజామాబాద్ జిల్లా ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్.సింధు శర్మ, నిజామాబాదు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ పి. పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుష్బూ ఉపాధ్యాయ, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, కంప్లైంట్ అథారిటీ చైర్ పర్సన్ నీరజ రెడ్డి,అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, అదనపు డీ.సీ.పీ (ఏ ఆర్,) కె.రామచంద్ర రావు,నిజామాబాద్ ఏ.సి.పి రాజ వెంకటరెడ్డి, నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏ.సి.పి శ్రీనివాసరావు, సి.ఐలు , ఆర్.ఐ,లు ఎస్.ఐలు, ఎఆర్ఎస్.ఐ లు, పోలీస్ మహిళా ఉద్యోగినులు, సి.పి.ఓ ఆఫీస్ మహిళా ఉద్యోగినులు,,ఫారెస్ట్ డిపార్ట్ మెంటు, రెవిన్యూ డిపార్ట్మెంట్, జ్యుడీషియల్ డిపార్ట్మెంట్, వస్త్రా దుకాణాల మహిళా ఉద్యోగినులు, అంగన్వాడి, ఆశా వర్కర్స్ ,జువెలర్స్ షాప్, ఉద్యోగినులందరూ పాల్గొన్నారు.
