టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి ని గెలిపించాలని, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన కొమురయ్యని విజ్ఞులైన యువత అధిక ఓట్లు వేసి గెలిపించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మరియు అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.గురువారం నిజామాబాద్ లోని నిఖిల్ సాయి హోటల్ లో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎవరైతే దేశం కోసం పనిచేస్తున్నారో వారి తరఫున నిలబడ్డ నిబద్ధత పట్టుదలగల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్.చిన్నమిలై అంజిరెడ్డిని,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యను అత్యధిక మెజారిటీతోని గెలిపించి వారిని ఎమ్మెల్సీకి శాసన మండలికి పంపించాలని కోరారు.అనంతరం అభ్యర్థి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అలాగే బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు.కూలచారి. దినేష్ కి ధన్యవాదాలు తెలిపారు.కామారెడ్డి ఎమ్మెల్యే.వెంకటరమణ రెడ్డి.పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడారు,ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తోపాటు కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి,అధ్యక్షులు.మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు.మాజీ ఎమ్మెల్యే.చింతల. రామచంద్రారెడ్డి బీజేపీ నాయకుడు పాల్గొన్నారు.
