జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బిసి, ఎస్సి, ఎస్టి, ఈబిసి లలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఏ పురుషోత్తం, బిసి స్టడీ సర్కిల్-ఆదిలాబాద్ సంచాలకులు జి ప్రవీణ్ కుమార్ గురువారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 15 నుండి 4 నెలల ఉచిత శిక్షణ ప్రారంభించడం జరుగుతుందని, అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని, అభ్యర్థుల ఎంపిక విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులకు ఫిబ్రవరి 9వ తేదీ లోగా ఆన్లైన్లో www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 12 నుండి 14 వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 08732-221280 నంబర్లో సంప్రదించవచ్చునని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
