పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో బెతెస్థ వాలంటరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గ్రామీణ పేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వయోజన విద్యా కేందం ప్రాజెక్ట్ అధికారి ముఖ్య అతిథిగా హాజరై, 10మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు పాస్టర్ కే ఆనంద్ మాట్లాడుతూ, లిటరసీ ఇండియా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి వినోద్, రాహుల్, రమేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
