తాజా మాజీ మున్సిపల్
చైర్ పర్సన్ అడువాల జ్యోతి
చేనేత హస్తకళలను అందరు ప్రోత్సహించాలని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ అడువాల జ్యోతి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ ప్రాంగణంలో చేనేత హస్తకళల హ్యాండ్లుం, హ్యాండిక్రాఫ్ట్స్ చేనేత హస్తకాళల ప్రదర్శన స్టాల్ ను మున్సిపల్ చైర్ పర్సన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత హస్త కళలు పురాతనమైనవన్నారు. విభిన్న రూపాల్లో సంప్రదాయాలను దాటే చేనేత హస్తకళలను అందరూ ప్రోత్సహించి ఆదరించాలన్నారు. ప్రదర్శన ఉంచిన ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుందనీ, ప్రతి ఒక్కరూ ప్రదర్శనను సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం నిర్వహకులు చైర్ పర్సన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వల్లెపు మొగిలి, నాయకులు, చేనేత హస్తకళల నిర్వాహకులు, తదితరులు, ఉన్నారు.
