సింగరేణి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే 1ఏ సమీపంలో గల సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు గురువారం ఏరియా జిఎం జి దేవేందర్ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే జాతరలో భాగంగా ఈ సంవత్సరం యధావిధిగా మొక్కులు చెల్లించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా సింగరేణి ఉద్యోగులపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రతాప్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, ఆర్కేపీ ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు తిరుపతి గౌడ్, ఏరియా నాయకులు పి బాణయ్య, ఆంటోని దినేష్, సివి రమణ, జెట్టి మల్లయ్య, గాండ్ల సంపత్, సిహెచ్పి శర్మ, మర్రి కుమార్, హరి రామకృష్ణ, గుమ్మడి సంపత్, జువ్వాజి శ్రీనివాస్, ఏరియా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
