back to top

భరోసా సెంటర్‌ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్

Date:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సరా కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ హాజరై బాధితులతో మాట్లాడి వారికీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ..భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. హింస,లైంగిక వేధింపులకు గురైన పిల్లలు,స్త్రీలు మరల ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు.లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళాల కు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని సిపి అభినందించారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్.,ఏసీపీ జి. కృష్ణ,పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్,పెద్దపల్లి ఎస్ఐ లు లక్ష్మణ్ రావు,మల్లేష్ లు, భరోసా సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...