జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రిలో మరో క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించమని ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 35 సంవత్సరాల వయస్సు గల మహిళలకు థైరాయిడ్ గ్రంథిని తొలగించడం జరిగిందన్నారు. ఈ గ్రంథి స్వరపేటిక కు అతి సమీపంలో ఉండే గ్రంథి అని, దానిని తొలగించడం చాలా అపాయంతో కూడుకున్నదని తెలిపారు. ఈ గ్రంథి మానవ శరీరంలో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేసి, శరీర మెటబాలిజం ని నియంత్రిస్తుందన్నారు. ఆపరేషన్ సమయంలో స్వరపేటికకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అతి జాగ్రత్తగా చేయాలని వివరించారు. బహుశా మంచిర్యాల పట్టణంలో సమర్థవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
