


ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) 11వ మహాసభ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో మార్చి 28 నుండి 30 వరకు నిర్వహించగా, ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈసందర్భంగా మహాసభలకు రాష్ట్రంలోని సింగరేణి నుండి హాజరైన సిఐటియు ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ ఫెడరేషన్ లో దేశవ్యాప్తంగా బొగ్గు గనుల కార్మికులు కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల నష్టపోతున్న విధానాలతో పాటు కోల్ ఇండియాలో చేస్తున్న ఒప్పందాలను సింగరేణిలో అమలు చేయకపోవడం, సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో బొగ్గు సంస్థల పరిరక్షణతో పాటు కార్మికుల పలు సమస్యలపై చేయబోయే ఆందోళనలకు పలు తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుగుణంగా కార్మికులకు చట్టబద్ధంగా ఉన్న హక్కులను లేకుండా బానిసత్వంలోకి నెట్టే విధంగా చేసిన చట్టబద్ధత లేని లేబర్ కోడ్ లను అమలు చేస్తున్న విధానాలకు నిరసనగా మే 20న అన్ని పరిశ్రమలతో పాటు బొగ్గు గని కార్మికులు సైతం ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఫెడరేషన్ లో అధ్యక్షులుగా శ్రీవాస్తవ్, కార్యదర్శిగా డిడి రామానందన్ తోపాటు సింగరేణి నుండి ఉపాధ్యక్షులుగా తుమ్మల రాజిరెడ్డి, కార్యదర్శులుగా మంద నరసింహారావు, యువ నాయకత్వంకు అవకాశం కల్పిస్తూ అల్లి రాజేందర్ ను కార్యదర్శిగా ఎన్నిక చేయడం చేశారు. అదేవిధంగా వర్కింగ్ కమిటీ సభ్యులుగా మెండే శ్రీనివాస్, మేదరి సారయ్య, విజయగిరి శ్రీనివాస్, కంపేటి రాజయ్య, కుంట ప్రవీణ్, వెంగళ శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి లు ఎన్నికయ్యారు. ఈ మహాసభకు సింగరేణితోపాటు కోలిండియా అనుబంధ అన్ని సంస్థల నుండి దాదాపు 260 వరకు ప్రతినిధులు, సింగరేణి నుండి హాజరు 30 మంది ప్రతినిధులు హాజరయ్యారు.