సంచిలో తులం బంగారం, ఇతర వస్తువులు
కోరుట్ల పట్టణంలో గురువారం రోజున పట్టణానికి చెందిన చింత చంద్రశేఖర్ తండ్రి శ్రీరాములు తన ఇంటిలో నుండి ఒక సంచిలో సుమారు ఒక తులం బంగారం ఇతర వస్తువులతో బైక్ పై వెళ్తుండగా అట్టి సంచి మార్గమధ్యంలో పడిపోయినదని ఆ సంచి కొరకు వెతికినా కనిపించక పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా బ్లూకోల్ట్ సిబ్బంది అయినా ఎల్.సంజీవ్, కే.శ్రీనులు అతను వెళ్లిన దారులకు తెలుసుకొని వెళ్లగా వారు ఆయా పరిసరాలలో ఉన్న సిసి కెమెరాలు పరిశీలించగా పట్టణ పురపాలక సంఘంలో పని చేసే వాటర్ లైన్మెన్లు అయినా ఎం.డి సలీం,శనిగారపు సురేష్ లకు అటుగా వెళ్తుండగా వారికి అట్టి బ్యాగు దొరకగా వారు దగ్గర్లో ఉన్న లతీఫ్ హోటల్లో ఇచ్చినారని తెలుసుకొని బ్లూకోల్ట్ సిబ్బంది అట్టి బ్యాగును పోలీస్ స్టేషన్ కు తీసుకొనివచ్చారు.కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీకాంత్ బాధితుడికి బ్యాగ్ ను అప్పగించారు.మున్సిపల్ లైన్మెన్లను,బ్లూ కోల్డ్ సిబ్బందిని సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీకాంత్ అభినందిచారు.ఇతరుల వస్తువులు ఎవరికైనా దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లయితే బాధితులను గుర్తించి ఇస్తామని ఈ సందర్బంగా ఎస్సై ఎస్.శ్రీకాంత్ తెలిపారు.
