
ఉదయక్రాంతి:- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విషయంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచర్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్య, పలువురు బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగిందని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలూద్దీన్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా బెల్లంపల్లి పట్టణ బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విషయంలో శనివారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముచర్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సబ్బని అరుణ్, ఎండి అలీ, తాళ్లపెల్లి మల్లయ్య, కాంపెల్లి రాజం, మద్దెల గోపి, గోగర్ల సత్యనారాయణ, ధర్మేందర్, రంగ రమేష్, దాగం చరణ్, సందీప్, పైడిమల్ల చంద్రశేఖర్, కలీం, శ్రావణ్, సతీష్ లపై బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.


