back to top

భూవివాదాల పరిష్కారానికై ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

Date:

మందమర్రి తహశీల్దార్ సతీష్ కుమార్

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ తగాదాలపై మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి మండల తహశీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం భూ  వివాదాలకు సంబంధించిన దరఖాస్తులను అర్జిదారుల నుండి స్వీకరించగా, హద్దుల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ అర్జీ దాఖలు అయ్యిందని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు మండలం లోనీ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, ఎస్హెచ్ఓ లు  ప్రతి సోమవారం భూ వివాదాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కలెక్టర్  ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ వివాదాల పరిష్కారాలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మండలంలోని రైతులు, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మందమర్రి పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ జి రాజశేఖర్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...