జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఉదయక్రాంతి:- శాసనమండలి ఎన్నికల దృష్ట్యా అధికారులు ఎన్నికల పనులలో నిమగ్నమై ఉంటున్నందున ప్రతి సోమవారం నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేయడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.