

ఉదయక్రాంతి:- పోలీస్ సిబ్బంది తమ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ లను, కన్నెపల్లి పోలీస్ స్టేషన్లను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల వివరాలు, గతంలో జరిగిన సంఘటన వివరాలు, ప్రాంతం, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, మావోయిస్టులకు సంబంధించి వారి కదలికలు ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టులకు సంబంధించిన వారి కదలికల గురించి అధికారులను, సీనియర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందిని అడిగి, ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను తెలుసుకొని, వారికి భరోసా, నమ్మకం కల్పించాలని, చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి వారి వివరాలు, చేస్తున్న విధులు, ఏదైనా సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి, పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ కరుణాకర్, చెన్నూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కన్నెపల్లి ఎస్ఐ గంగారం లు పాల్గొన్నారు.