పద్మశాలి సంఘం అధ్యక్షునిగా అవకాశం కల్పించండి…. బత్తుల శ్రీనివాస్

0
21

సంఘం అభివృద్ధికి కృషి చేస్తా……

ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా మరో మారు తనకు అవకాశం కల్పించాల్సిందిగా పద్మశాలి సంఘం అధ్యక్ష అభ్యర్థి బత్తుల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 15న జరగనున్న పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుని ఎన్నికల్లో కుల బాంధవులందరూ తమ అమూల్యమైన ఓటును రాట్నం గుర్తు (క్రమసంఖ్య 3) పై వేసి, తనను గెలిపించి, మరో మారు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. గతంలో 2015లో సంఘం అధ్యక్షునిగా సంఘానికి సేవలు చేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో అందరి సహకారంతో సంఘం అభివృద్ధిలో ముందుండి కుల బాంధవుల సమస్యలను పరిష్కారానికి సహాయ సహకారాలు అందించానని, అందరి సహకారంతో సంఘ భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కుల దైవమైన మార్కండేయ స్వామి గుడి నిర్మాణ సైతం కృషి చేశానని గుర్తు చేశారు. ఆనాటి కృషి ఫలితంగా పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో ఆలయ నిర్మాణానికి 10 గుంటల స్థలం మంజూరు చేయడం జరిగిందని, ఆ స్థలంలోనే 2023లో గుడి నిర్మాణానికి ఆనాటి ఎమ్మెల్యే బాల్క సుమన్ చేతుల మీదుగా భూమి పూజ సైతం నిర్వహించుకున్నామని తెలిపారు. అదేవిధంగా పద్మశాలి భవన్లో సదుపాయాల కల్పనకు కృషి చేయడం తో పాటు కుల బాంధవులకు అండగా ఉంటూ, ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అధ్యక్షునిగా మరో మారు తనకు అవకాశం కల్పిస్తే, అందరి సహాయ సహకారాలతో మార్కండేయ స్వామి గుడి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అధ్యక్షునిగా తనను గెలిపిస్తే కుల బాంధవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానన్నారు. అదేవిధంగా పద్మశాలి భవన లో మెరుగైన సదుపాయాలకు కల్పిస్తానని, ప్రభుత్వ పథకాలు కుల బాంధవులకు అందేలా కృషి చేస్తానని,  మహిళ కొరకు గతంలో నిర్వహించిన విధంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సైతం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కుల సంఘం సభ్యులు ఒడ్నాల శంకర్, ఒడ్నాల ప్రభాకర్, కొండి కనకయ్య, ఆడెపు వేణు, నాగభూషణం, గుడిపల్లి సంతోష్, అడిగొప్పల మురళి, వలుస సదానందం, కుడికాల రాజు, మేకల వెంకటేశ్వర్లు, బండారి సదానందం, బండారి సత్యనారాయణ, నల్ల అశోక్, కొండి నర్సయ్య లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి