
ఉదయక్రాంతి:- గత 39 సంవత్సరాలుగా సింగరేణికి సేవలందించి పదవి విరమణ పొందుతున్న మంచిర్యాల జిల్లా సింగరేణి మందమర్రి ఏరియాలోని కాసీపేట 1 గనికి చెందిన సపోర్ట్ మెన్ నీలి సమ్మయ్య ను సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం గని ఆవరణంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు సమ్మయ్య దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కేంద్ర కమిటీ నాయకుడు బన్న లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ, సమ్మయ్య శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ గని పిట్ కార్యదర్శి రవీందర్, నాయకులు సోగల కన్నయ్య, పైడిపల్లి శ్రీకాంత్ సిద్ధార్ల రాజన్న, అట్లా శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సంపత్, సంతోష్ పాండే, దినేష్ , రాజ్ కుమార్ ధరణి సాయి, అంజిరెడ్డి, రాజ్ కుమార్, బాల్త శ్రీనివాస్, రాజేష్ లు పాల్గొన్నారు.