
భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, రైతులు తమ భూ సమస్యలపై దరఖాస్తు చేసుకొని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల తహశీల్దార్ సతీష్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. మండలంలోని జూన్ 4 నుండి జూన్ 19 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు తమ భూ సమస్యలపై సంబంధిత గ్రామాల యందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం, సోమవారం మండలంలోని మామిడిగట్టు, వెంకటాపూర్ గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి అభ్యంతరాలు లేని రైతులకు పాస్ పుస్తకాలు అందజేయడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 6, 9న వెంకటాపూర్ లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో, జూన్ 10, 11న లేమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో, జూన్ 12, 13న క్యాతనపల్లి ఎంపీపీ పాఠశాలలో, జూన్ 16, 17న అమరవాది ఎంపీపీ పాఠశాలలో, జూన్ 18, 19న మందమర్రికి సంబంధించి ఊరు మందమర్రి గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో, జూన్ 6, 9న మామిడిగట్టు లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో, జూన్ 10, 11న సారంగపల్లి లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో, జూన్ 12, 13న తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి బొక్కలగుట్ట రైతు వేదికలో, జూన్ 16, 17న అందుగులపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.