back to top

జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్టు జాడ క్రాంతి కుమార్

Date:

అలరించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు

తెలుగు సంస్కృతి సాహితి సేవ ట్రస్ట్, మాచవరం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానోత్సవం

ఉదయక్రాంతి:- అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, మాచవరం సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేకడుకల్లో జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్(టైమ్స్ ఆఫ్ వార్త) దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.  ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మిక గురువు దైవాజ్ఞ శర్మ, నవల రచయిత సురపల్లి విజయ, న్యూరాలజిస్ట్ డాక్టర్ ముదిగొండ గోపికృష్ణ, విప్రో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్, అఖిలభారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం లు హాజరుకాగా, యాంకర్ గా మోహన్ గాంధీ వ్యవహరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఈసందర్భంగా నిర్వాహకులు కళా ప్రదర్శన నిర్వహించిన కళాకారులను శాలువతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి, ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.

ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ అఫ్ వార్త) కు జాతీయ అవార్డు – 2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈకార్యక్రమంలో అభినృత్య కూచిపూడి కళాశాలకు చెందిన శేర్లి మరియా ఫరాక్, త్రిపుర నృత్య భారతి క్లాసికల్ డాన్స్ అకాడమీ కైరిక నందిని, స్వరవాహిని శిక్షణాలయం చక్రావధామల ప్రసన్నలక్ష్మి, జై భీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉమాదేవి, కన్వీనర్ ఇనుముల రాజేశ్వర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది మంజుల మదరం, సోషల్ లిస్ట్ మంజుల పూజారి, సోషల్ వర్కర్ కందన్ జోషి, సినిమా ఆర్టిస్ట్ దోర్నాల హరిబాబు, తెలంగాణ సంస్కృతి సాహిత్య సేవా ట్రస్ట్ సభ్యులు మాచవరం నరసింహ సాయి శ్రీనివాస్, అద్దంకి నాగేశ్వరరావు మాచవరం సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు….జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజల...

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది…రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వనమహోత్సవం ఉదయక్రాంతి:- పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై...

గని ప్రమాదంలో కార్మికుని మృతి…కార్మిక సంఘాల ఆందోళన

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ ఉదయక్రాంతి:-...

చెస్ టోర్నమెంట్ ను విజయవంతం చేయండి

ఉదయక్రాంతి:- ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్...