back to top

చిన్న వయస్సులోనే అల్లి రాజేందర్ జాతీయ నాయకుడిగా ఎదగడం సంతోషకరం

Date:

ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్)జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్) గా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ చిన్న వయస్సులోనే ఎన్నిక కావడం సంతోషకరమని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకట స్వామి తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి సివిల్ విభాగం కార్యాలయంలో సివిల్ విభాగం సిఐటియు శ్రేణులు, ఐఎన్టియుసి యూనియన్ నాయకులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం శ్రేణులు సంయుక్త ఆధ్వర్యంలో అల్లి రాజేందర్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు పంచి పెట్టి, శుభాకాంక్షలు తెలుపుతూ, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకట స్వామి మాట్లాడుతూ, ఏఐసిడబ్ల్యూఎఫ్ 11వ మహాసభలు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించగా, సింగరేణి నుండి తుమ్మల రాజారెడ్డి జాతీయ ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా మంద నరసింహారావు తో పాటు అల్లి రాజేందర్ సైతం జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలిపారు. అల్లి రాజేందర్ కు సన్మానించిన సివిల్ విభాగం కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ సివిల్ విభాగం పిట్ కార్యదర్శి ఏ రాజ్ కుమార్ మాట్లాడుతూ, అల్లి రాజేందర్ సమస్యలపై తనకున్న అవగాహన మేరకు అందర్నీ చైతన్య చేయడంలో ఎప్పుడు ముందుంటారని, సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో అందరికీ తెలియజేస్తూ, అదే విధంగా ఒక సాధారణ కార్మికుడిగా తన పని తన చేసుకుంటేనే, సమస్యలపై యాజమాన్యంపై పోరాడుతారని తెలిపారు. రాజేందర్ జాతీయ కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. సిఐటియు యూనియన్ యువతకు ప్రాధాన్య కల్పించడంలో ముందుంటుందని అనేందుకు ఇదే నిదర్శనం అని తెలిపారు. అనంతరం ఐఎన్టియుసి సివిల్ విభాగం పిట్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తనకు, అల్లి రాజేందర్ కు మంచి అనుబంధం కలదని, యూనియన్ల భేదభావం లేకుండా, ఎవరు ఏది అడిగినా కాదనకుండా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలని అందరికీ తెలియజేస్తాడని తెలిపారు.  అందరితో కలిసి ఉంటూ, కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నాడని, రాజేందర్ విధుల్లో చేరినప్పుడు నుండే కష్టపడి పని చేస్తే మనస్తత్వం కలవాడని, ఆయన వ్యక్తిత్వమే నేడు ఆయనకు సిఐటియు యూనియన్ లో తగిన గుర్తింపు వచ్చిందని అభిప్రాయ పడ్డారు. అనంతరం సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజేందర్ తన దగ్గరికి వచ్చే కార్మికులు కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులనే తేడా లేకుండా అందరితో ఒకే విధంగా ప్రవర్తిస్తూ, కలిసిమెలిసి ఉంటారన్నారు. ఆయన భవిష్యత్తులోనూ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ విభాగం యూనియన్ గౌరవ అధ్యక్షుడు సత్తయ్య, అధ్యక్షులు బి మహేందర్, ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి బి కుమారస్వామి, ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, శంకర్, ఐఎన్టియుసి అసిస్టెంట్ పిట్ కార్యదర్శి గట్టు నరసయ్య, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు….జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజల...

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది…రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వనమహోత్సవం ఉదయక్రాంతి:- పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై...

గని ప్రమాదంలో కార్మికుని మృతి…కార్మిక సంఘాల ఆందోళన

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ ఉదయక్రాంతి:-...

చెస్ టోర్నమెంట్ ను విజయవంతం చేయండి

ఉదయక్రాంతి:- ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్...