పట్టణానికి చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు పఠాన్ జమీల్ ఖాన్ ఇటీవల భారత క్రీడారత్న అవార్డు అందుకున్న సందర్భంగా గురువారం పట్టణంలోని పాత బస్టాండ్ లో స్థానికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ, జమీల్ ఖాన్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జమీల్ ఖాన్ ను జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడికందుల రమేష్, కనకయ్య గౌడ్, హృదయ రాజ్, అంకం రాజ్ కుమార్, శ్రీధర్, సాగర్, రవి, మహేష్, స్వామి, భూషణ్, పోశం చంద్రకాంత్ లు పాల్గొన్నారు.
