back to top

కులాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి

Date:

కేవిపిఎస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ 

ఉదయక్రాంతి:- కులాంతర వివాహితుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) మంచిర్యాల జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని చార్వక ట్రస్ట్ హాల్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో  కులంతార వివాహాల జంటలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించి, వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డూర్కే మోహన్ మాట్లాడుతూ,  ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో ప్రత్యేక రక్షణ చట్టం కోసం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగమే కుల నిర్మూలనే తన లక్ష్యంగా ప్రకటించుకుంటే, దానిని అమలు జరిపే పాలకులు మాత్రం వాటి ప్రోత్సాహం పట్ల సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని ఆరోపించారు. కులంతార వివాహాల ప్రోత్సాహం కేవలం షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మాత్రమే జిఓ నెంబర్ 12 ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుందని బిసి, మైనార్టీ, ట్రైబుల్ శాఖలు ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక శాతం ప్రాధాన్యత నివ్వాలని, ఇంటి స్థలం ఇచ్చి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కులంతర వివాహాల్లో తారతమ్యాలు లేకుండా తాను పుట్టిన కులం కాకుండా వేరే ఏ కులంలో  వివాహం చేసుకున్న జంటలకు అందరికీ 10 లక్షల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు  రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయని, సగటున ప్రతిరోజు ఐదు దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో రాష్ట్రం దళితులపై దాడుల్లో ఆరవ స్థానంలో ఉందని, అట్రాసిటీ చట్టం చిత్తశుద్ధితో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాజేశం, సంకె రవి, బిసి సబ్ ప్లాన్ సాధన కమిటీ అధ్యక్షులు రాందాస్, సామాజిక ఉద్యమకారులు కలవల శంకర్, సమ్మన్న, కైలాసం సిఐటియు జిల్లా నాయకులు రంజిత్, ప్రకాష్, బోడింకి చందు,అనిల్  కులాంతర వివాహం చేసుకున్న జంటలు కామెర మధుకర్ సరిత, తిలక్ భవాని, ప్రశాంత్ శ్రావణి, సుజాత లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...