చెన్నూరు ఏడిఏ బానోత్ ప్రసాద్
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో ఫిబ్రవరి 7,8,9 న నిర్వహించు కిసాన్ అగ్రి షో-2025 ను మండలం లోని రైతులు సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఏడిఏ బానోతు ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మండలంలోని పులిమడుగు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, అగ్రి షో లో వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణ ప్రదర్శనను వీక్షించడంతో వ్యవసాయ రంగంలో మరింత అవగాహన పొందవచ్చునని, ఈ వ్యవసాయ ప్రదర్శన సందర్శించడంతో వ్యవసాయం అనుబంధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా నూతన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు విత్తనాలు, పురుగుల మందులు తదితర వాటిలో నూతన ఆవిష్కరణలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనకు రైతులు సొంత ఖర్చుతోనే వెళ్లాలని సూచించారు. అదేవిధంగా మండలంలో నిర్వహించబడుతున్న డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు లు పాల్గొన్నారు.
