back to top

ఒకే స్థలంలో.. ఒకే దేవతకు… రెండు ఆలయాలు

Date:

గందరగోళంలో ముదిరాజ్ కులస్తులు
రెండో ఆలయ నిర్మాణానికి అనుమతులు ఎక్కడివి…?

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి పట్టణ ముదిరాజ్ లు ముందుకు వచ్చి గతంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, బేస్మెంట్ నిర్మించి, ఫిల్లర్ ల కొరకు రాడ్లు సైతం ఏర్పాటు చేశారు. తాజాగా ముదిరాజ్ కులస్తులు ఫిబ్రవరి 19న ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో ఆలయ నిర్మాణంపై ముదిరాజ్ సోదరుల్లో గందర గోళం నెలకొంది. పట్టణంలో ముదిరాజ్ ల జనాభా అధికంగా ఉండడంతో గత తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముదిరాజ్ ల ఐక్యంగా ముందుకు వచ్చి, ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, సాధించగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముదిరాజ్ ల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన అది కార్యరూపం దాల్చాలేదు.  గత 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ పెద్దమ్మతల్లి ఆలయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి, ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు ఆలయానికి పట్టణంలోని సిఈఆర్ క్లబ్ సమీపంలో స్థలం సైతం కేటాయించడం దీనిలో భాగంగా ముదిరాజ్ సోదరులు ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చి, నిర్మాణ పనులు సైతం ప్రారంభించారు. తాజాగా ముదిరాజ్ కులస్తుల ఫిబ్రవరి 4న అదే స్థలంలో పాత గుడికి కొంచెం ముందుకు మరో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి, ముగ్గు పోశారు. మరల ఫిబ్రవరి 19న ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో ముదిరాజ్ కులస్తులలో ఐక్యతరాగం లేక గందరగోళ వాతావరణం నెలకొందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఆలయ నిర్మాణానికి కులస్తులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించి, ఆలయ నిర్మాణానికి అందించగా, పట్టణానికి చెందిన కులస్తుడు జిల్లాలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళం ప్రకటించి, దగ్గరుండి నిర్మాణ పనులు ప్రారంభించాలని కులస్తులకు సూచించారు. కాగా అదే కులంలోనే మరో వర్గం భూమి పూజ నిర్వహిస్తున్నమంటూ ప్రకటించడంతో కులస్తుల్లో ఐక్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందనే వాదన పట్టణంలో బలంగా వినబడుతుంది .
ఒకే స్థలంలో రెండు ఆలయాలు…?
పట్టణంలోని సిఈఆర్ క్లబ్ సమీపంలో పెద్దమ్మ తల్లిని ఆలయ నిర్మాణానికి కులస్తుల ముందుకు వచ్చి భూమి పూజ నిర్వహించగా, తాజాగా మరో వర్గం సైతం అదే స్థలంలో ఆలయ నిర్మాణానికి ఉపక్రమించడంతో ఒకే స్థలంలో రెండు ఆలయాల నిర్మాణం ఎలా సాధ్యమవుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రార్థన మందిరం గుడి గాని, చర్చి గాని, మసీదు కాని నిర్మించాలంటే జిల్లా కలెక్టర్ నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే స్థలంలో ఒకే దేవతకు సంబంధించి రెండు ఆలయాల నిర్మాణానికి అనుమతులు లభించాయా లేదా అనేది బేతాళ ప్రశ్నగా గోచరిస్తుంది. జిల్లా ఉన్నతాధికారులు ఒకే స్థలంలో రెండు ఆలయాలకు అనుమతులు ఇచ్చారా అనే అనుమానాలు కుల సోదరులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్మించాలని తలచి, భూమి పూజ చేస్తున్న చోట ఆలయాన్ని నిర్మిస్తే,  మొదట నిర్మాణ పనులు ప్రారంభించిన ఆలయానికి దారి సైతం ఉండదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బిసి ఉద్యమం జరుగుతుండగా, బీసీలలోని మెజార్టీ కులస్తులైన ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి, ఆలయ నిర్మాణానికి కృషి చేయాల్సింది పోయి, పంతాలకు, పట్టింపులకు పోయి, ఒకే స్థలంలో ఒకే దేవతకు రెండు ఆలయాలను నిర్మించాలని రెండు వర్గాలుగా విడిపోవడం సరైనది కాదనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. కేవలం గుడి పేరు మీద వసూలు చేసే చందాలు, గుడిపై ఆధిపత్యం కొరకే ఈ గ్రూపు తగాదాలకు తెరతీస్తూ, హిందువుల తోపాటు కులస్తుల మనోభావాలకు భంగం వాటిల్లేలా ఒకే దేవత మూర్తికి సంబంధించి రెండు ఆలయాలను పక్కపక్కనే నిర్మించాలని పూనుకున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర, జిల్లా ముదిరాజ్ కుల సంఘాల బాధ్యులు, పట్టణ కుల సంఘంలో ఉన్న ఐక్యత లోపాన్ని గుర్తించి, దానిని ఆదిలోనే తుంచి వేసి, ముదిరాజ్ కులస్తులందరూ ఒకే వేదిక మీద ఉండి, పని చేసేలా కృషి చేసి, బీసీ ఉద్యమానికి దిక్సూచిగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
స్థలం ఎంపికలోనూ లోపించిన ఐక్యత
ముదిరాజ్ కులస్తులతో పాటు అనేకమంది ఇంటి ఈలవేల్పుగా కొలిచే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించాలని ముదిరాజ్ కులస్తులు ముందుకు రావడం అభినందనీయమే. అయినప్పటికీ గుడి నిర్మించాలనే శ్రద్ధ కన్నా వారికి చందాలు, గుడిపై ఆధిపత్యం పై ఉన్న శ్రద్ధ మూలంగా స్థలం ఎంపికలోను సైతం ముదిరాజ్ లు తొందర పడ్డారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్మించ తలపెట్టిన స్థలానికి సమీపంలోనే సింగరేణి క్వార్టర్లకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు ఉండగా, మరోపక్క పెద్ద వాగు కలదు. వాగును అనుకొనే పెద్దమ్మతల్లి గుడి నిర్మాణం జరుగుతుండగా, సెప్టిక్ ట్యాంక్ సమీపంలో ఉండటంతో గుడి నిర్మాణమైన తర్వాత భక్తులు, ప్రజలు గుడి ఆవరణలో ప్రశాంతంగా సేదదీరే అవకాశం ఉండదని, ఏదైనా కార్యక్రమం గుడి ఆవరణంలో నిర్వహించాలన్న దుర్గంధం తప్పదు. దుర్గంధంలోనే అమ్మవారిని భక్తులు ఎలా దర్శించుకుంటారని పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా ముదిరాజ్ కులస్తులు తమలోని ఆధిపత్య పోరుకు స్వస్తి పలికి, అందరు ఐక్యమై, పట్టణంలో ముదిరాజ్ కులస్తుల, హిందువుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి గుడి నిర్మాణాన్ని చేపట్టి, పూర్తి చేయాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...