
వారం క్రితం మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025
నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుగా పురస్కారం
ఉదయక్రాంతి:- మీడియా రంగంలో సామాన్య పాత్రికేయుడిగా, నవసమాజ నిర్మాణం కోసం, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ, తనదైన శైలిలో వార్తా కథనాలతో ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, జర్నలిస్టుల, ప్రజా సంక్షేమం, రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ, ముఖ్యంగా కరోనా కాలంలో స్వచ్ఛందంగా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల పక్షాన పలు పోరాటాలు నిర్వహించిన సామాన్య జర్నలిస్టు, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన, టైమ్స్ ఆఫ్ వార్త తెలుగు దినపత్రిక రిపోర్టర్ జాడ క్రాంతి కుమార్ చేస్తున్న కృషిని గుర్తించి, ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాజ గాన సభలో అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, మాచవరం సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకల్లో జాతీయ అవార్డు 2025 అందించి, ఘనంగా సత్కరించారు.

గతవారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025తో ఘనంగా సత్కరించారు.

ఆదివారం హైదరాబాద్ లోని లోని త్యాగరాజ గాన సభలో నిర్వహించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రఖ్యాత కళాకారులు, సాహితీవేత్తల సమక్షంలో జర్నలిస్టుగా క్రాంతి కుమార్ చేసిన సేవలను గుర్తించి, ఆయనకు జాతీయ అవార్డు-2025 అందించి, గౌరవించారు. ఇదే వేదికపై పలువురు కవులు, కళాకారులు, పర్యావరణవేత్తలు, సామాజిక సేవకులు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన పలువురిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జాతీయ అవార్డు అందుకున్న టైమ్స్ ఆఫ్ వార్త రిపోర్టర్ జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, తనకు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని, జాతీయ అవార్డు ప్రధానం చేసిన నిర్వాహకులకు, మంచిర్యాల జిల్లా జర్నలిస్టుగా తనను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, అండగా ఉన్న టైమ్స్ ఆఫ్ వార్త తెలుగు దినపత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి,సహచర పాత్రికేయ మిత్రులకి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు,ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ, ప్రజా, కుల, కార్మిక, విద్యార్ధి సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు, ఎల్లప్పుడూ తన అండగా ఉంటూ, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా గడిచిన వారం పది రోజులోనే రెండు ప్రముఖ సంస్థల నుండి ఉత్తమ జర్నలిస్టుగా జాతీయ అవార్డులు అందుకున్న క్రాంతి కుమార్ ను సాటి పాత్రికేయులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.