back to top

ఇంటర్ ఫలితాలలో శ్రీ హర్ష విజయకేతనం

Date:

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందించిన కళాశాల చైర్మన్ పల్లె భూమేష్

ఉదయక్రాంతి:- రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని  శ్రీ హర్ష జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి, విజయకేతనం ఎగురవేశారు. ప్రకటించిన ఫలితాలలో బైపిసి  ప్రథమ సంవత్సరం లో రంగు సంజన 432/440, రాగోల నీతు 430/440 , ఎంపిసి లో నిమ్మతి స్పందన 454/470, సిఈసి లో అంజుమ్ 477/500, ఆరీభ ఈశాల్ ఎంపీసి 434/470, లక్కం సాగరిక 433/470, శనిగారపు దివ్యశ్రీ 427/470, బైపిసి లో దుర్గం శిరీష 407/440, సిఈసి లో గడ్డం నిత్యశ్రీ 448/500, కురిసింగ హిరణ్య రావు 417/500 ఎంపిహెచ్డబ్యు లో  దండేరా రాజేశ్వరి 476/500, ఎంఎల్టి లో ఆకునూరి అమూల్య 467/500 ఎంపిహెచ్డబ్యు ద్వితీయ సంవత్సరంలో పంబాల వర్ష 955/1000 , ఏసీపి ద్వితీయ సంవత్సరంలో మానేపల్లి రాజేశ్వరి 950/100మార్కులను సాధించి, కళాశాల కీర్తి ప్రతిష్టలను నిలబెట్టారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ మాట్లాడుతూ, విద్యార్థులు రానున్న రోజులలో మంచి ఫలితాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాలలో విద్యనభ్యసించిన మరెందరో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పల్లె భూమేష్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పోటు మనోహర్ రెడ్డి , తనుగుల శ్రావణ్ ప్రిన్సిపాల్ ఆరె లావణ్య,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనిత ఠాకూర్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు….జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజల...

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది…రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వనమహోత్సవం ఉదయక్రాంతి:- పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై...

గని ప్రమాదంలో కార్మికుని మృతి…కార్మిక సంఘాల ఆందోళన

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ ఉదయక్రాంతి:-...

చెస్ టోర్నమెంట్ ను విజయవంతం చేయండి

ఉదయక్రాంతి:- ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్...